లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్‌

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్‌ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత వరకు యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.. సీబీఐతో విచారణ జరిపించేందుకు అంత సుముఖతను వ్యక్తం చేయలేదు ధర్మాసంనం.. సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదనేందుకు గల కారణాలు ఏమిటో మీకు బాగా తెలుసంటూ సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీజేఐ ఎన్వీ రమణ. లఖింపుర్ ఘటన అత్యంత సున్నితమైన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే సరైన రీతిలో చర్యలు తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, లఖింపుర్‌ ఖేరి ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. దీనిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాయడంతో.. గురువారం రోజు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. లఖింపుర్‌ ఘటనపై తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయీ నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు యూపీ సర్కారు ఇవాళ ఆ నివేదికను సమర్పించింది. కానీ, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు? ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఇక, దసరా తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్‌

Related Articles

Latest Articles