సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. మరో పిటిషన్ కొట్టివేత

దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని నిర్మించేందుకు కేటాయించిన స్థలంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమి వినియోగాన్ని మార్చడానికి గల కారణాలను సంబంధిత అధికారులు వివరించారని, ఈ వివరణ సమర్థనీయంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరపడానికి తగిన కారణం లేదని… అందువల్ల దీనిని కొట్టివేయడం ద్వారా మొత్తం వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు పేర్కొంది.

Read Also: నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు

కాగా కొత్త పార్లమెంట్ భవన సముదాయం పబ్లిక్ రిక్రియేషనల్ జోన్‌పై ప్రభావం చూపుతుందని పిటిషనర్ ఆరోపించాడు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇక్క డ ప్రైవేటు ఆస్తిని సృష్టించడం లేదు. ఉపరాష్ట్రపతి నివాసాన్ని ఏర్పా టు చేస్తున్నా రు. చుట్టూ పచ్చదనం ఉంటుంది. ఈ ప్రణాళికకు ఇప్పటికే అధికారులు ఆమోదం తెలిపారని వాఖ్యానించింది. ప్ర‌తి పనిని విమ‌ర్శించవ‌చ్చు కానీ.. ఆ విమ‌ర్శ నిర్మాణాత్మ‌కంగా ఉండాల‌ని కోర్టు హితవు పలికింది. కాగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును 2019 సెప్టెంబరులో ప్రకటించగా… 2022 నాటికి దీనిని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

Latest Articles