క‌న్వ‌ర్ యాత్ర‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం: యూపీకి నోటీసులు

క‌న్వ‌ర్ యాత్ర‌కు యూపీ అనుమ‌తులు ఇవ్వ‌డంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  క‌రోనా దృష్ట్యా అనుమ‌తులు ఎలా  ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.  సుమోటోగా కేసును స్వీక‌రించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది.  అయితే, ఈ యాత్ర‌కు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనుమ‌తి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.  మ‌హాశివుడి భ‌క్తులు ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్క‌డి ప‌విత్ర‌మైన గంగాన‌ది జ‌లాలను తీసుకొని వ‌స్తారు.  వాటిని స్థానికంగా ఉండే శివాల‌యంలో మ‌హాశివునికి అభిషేకిస్తారు.  ఈ యాత్ర ప్ర‌తి ఏడాది క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హిస్తుంటారు.  వేలాది మంది భ‌క్తులు ఈ యాత్ర‌లో పాల్గొంటారు.  కానీ, ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా యాత్ర‌కు త‌క్కువ మందికి మాత్ర‌మే అనుమ‌తించిన‌ట్టు యూపి ప్ర‌భుత్వం చెబుతున్న‌ది.  

Read: థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-