రేపు తిరుమలకు సీజేఐ ఎన్వీ రమణ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. శ్రీవారి దర్శనార్థం రేపు తిరుమలకు రానున్నారు చీఫ్ జస్టిస్… మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న ఆయన.. ఆ తర్వాత తిరుచానూరుకు వెళ్లనున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి తిరుమలకు చేరుకుంటారు.. ఇక, ఎల్లుండి (శుక్రవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కూడా తిరుమలకు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తిరుమలకు రావడం ఇదే తొలిసారి కానుంది.. మరోవైపు.. ఎల్లుండి శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో పాల్గొననున్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు.

-Advertisement-రేపు తిరుమలకు సీజేఐ ఎన్వీ రమణ

Related Articles

Latest Articles