సూపర్ స్టార్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో మహేష్ మిస్…!?

సూపర్ స్టార్ కృష్ణ 78వ పుట్టినరోజు నేడు. ఆయన తన కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ తన కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశాడు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఇంట్లోనే ఈ వేడుకలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పిక్స్ లో కృష్ణ భార్య ఇందిరా దేవి, సుధీర్ బాబు, నరేష్, గల్లా జయదేవ్, గల్లా అశోక్, సంజయ్ స్వరూప్, ఘట్టమనేని ఆది శేషగిరి రావు, ఇతర కుటుంబ సభ్యులను మనం చూడవచ్చు. అయితే ఇందులో మహేష్ ఫ్యామిలీ మాత్రం కన్పించకపోవడం గమనార్హం. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలోనే మహేష్ ఈ వేడుకలకు దూరంగా ఉన్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఈరోజు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు మహేష్ బాబు తన తండ్రి పుట్టినరోజు స్పెషల్ గా తాను దత్తత తీసుకున్న కుటుంబాలకు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కూడా నిర్వహించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-