బుల్లితెరపైనా ‘జాతిరత్నాలు’ హిట్

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

ఇటీవల ఈ సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఎలా అయితే ఆడియన్స్ ను ఆకట్టుకుందో ఆదే స్థాయిలో బుల్లి తెరపై కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు 10.2 టీఆర్పీ రేటింగ్ దక్కినట్లు సమాచారం. నిజానికి ఈ స్థాయి రేటింగ్ పెద్ద సినిమాలకు మాత్రమే దక్కుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే అదే రోజు ఎన్టీఆర్, రామ్ చరణ్ సందడి చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కూడా టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ ప్రసారం అయ్యాయి. ఎన్టీఆర్ షో కంటే కొద్దిగా తక్కువ రేటింగ్ ను ‘జాతిరత్నాలు’ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ సన్నాహాల్లో ఉన్నాడు. ఇక హీరో నవీన్ పొలిశెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దుమ్ము రేపుతున్నాడు.

Related Articles

Latest Articles

-Advertisement-