దీపావళి కానుకగా రజనీకాంత్ ‘అన్నాత్తే’

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేశ్ , నయనతార, మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, సూరి కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రకటన వెలువడగానే రజనీ కాంత్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ‘అన్నాత్తే దీపావళి’ అనే హ్యాష్ ట్యాగ్ తో హంగామా మొదలెట్టేశారు.

Read Also : ‘మా’ ఎలక్షన్స్ : ప్రకాష్ రాజ్ కు మరో సీనియర్ హీరో సపోర్ట్

ఏప్రిల్ లో తమిళనాట కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లను మూసేశారు. వాటిని ఎప్పుడు తెరుస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయినప్పటికీ థియేటర్లు రీ-ఓపెన్ చేసిన తర్వాత వచ్చే అది పెద్ద సినిమా ‘అన్నాత్తే’ నే అవుతుంది. దీనికి ముందు రజనీకాంత్ కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది.

-Advertisement-దీపావళి కానుకగా రజనీకాంత్ 'అన్నాత్తే'

Related Articles

Latest Articles