ప్రయాణం ఆపేస్తే గమ్యానికి విలువేముంది ?… “సూపర్ మచ్చి” ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న “సూపర్ మచ్చి” చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రచతా రామ్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ ప్రసాద్, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్ తన హోమ్ బ్యానర్ రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Read Also : ‘రౌడీ బాయ్స్’కు ‘రాధేశ్యామ్’ హెల్ప్

ట్రైలర్ బాగుంది… ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అని తెలుస్తోంది. హీరోను హీరోయిన్ రాముడిగా మార్చేస్తుందా ? థమన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. ఒకరినొకరు చూడకుండా ప్రేమలో పడటం మంచి కాన్సెప్ట్. మరి హీరోయిన్ తో జర్నీలో హీరో రాముడు అవుతాడా ? అన్నది చూడాలి. ఇక సంక్రాంతి రేసులో పోటీ పడబోతున్న సినిమాల్లో “సూపర్ మచ్చి” చిత్రం కూడా ఒకటి.

Related Articles

Latest Articles