కాస్త ఘాటుగానే.. ‘సూపర్ డీలక్స్’ తెలుగు ట్రైలర్

తమిళంలో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోంది. త్యాగరాజన్‌ కుమారరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈమేరకు ట్రైలర్ విడుదల చేశారు. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ట్రైలర్ లో కాస్త ఘాటు ఎక్కువే అయ్యింది. విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించగా, సమంత మరోసారి రెచ్చిపోయి నటించింది. ఫహద్‌ ఫాజిల్‌ కూడా కనిపించినంత మేరకు పర్వాలేదనిపించాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-