రాజస్థాన్ పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌ సెకండాఫ్‌లో హైదరాబాద్‌ మొదటి విజయం సాధించింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్‌ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని విలియమ్సన్‌ సేన 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్‌ జట్టులో జేసన్‌ రాయ్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌ అర్ధసెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

కెప్టెన్‌ సంజూ శాంసన్‌ 82 మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అటు సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. అయితే జేసన్‌ రాయ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున ఇదే తొలి మ్యాచ్‌. కాగా తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకం సాధించిన రాయ్‌ చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో లేని వార్నర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్‌ ఫోర్లు, సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. మొత్తం 42 బంతులెదుర్కొన్న జేసన్‌ రాయ్‌ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో​ 60 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్‌ విజయం సాధించింది.

-Advertisement-రాజస్థాన్ పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గ్రాండ్ విక్టరీ

Related Articles

Latest Articles