‘బాయ్స్’ నుండి భారీ మొత్తం తీసుకున్న సన్నీ లియోన్!

గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బాయ్స్’. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ లవ్ స్టోరీ ని దయానంద్ డైరెక్ట్ చేశాడు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ దీన్ని నిర్మించారు. స్మరణ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ఓ పాటకు మంచి స్పందన లభించింది. శ్రీమణి రాసిన ఆ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు.

Read Also : సౌత్ ద్విభాషా చిత్రంలో ‘సాహో’ బ్యూటీ

ఇదిలా ఉంటే… తాజాగా సెన్సేషనల్ హాట్ స్టార్ సన్నీలియోన్ తో ఈ చిత్ర బృందం మూవీ టీజర్ ను రిలీజ్ చేయించింది. దీన్ని విడుదల చేయడానికి ‘బాయ్స్’ టీమ్ నుండి అక్షరాల 12 లక్షల రూపాయలను సన్నీ లియోన్ డిమాండ్ చేసిందట. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘బాయ్స్’ సినిమా టీజర్ ను ఆవిష్కరించడానికి సన్నీనే సరైన మనిషి అని భావించిన దర్శక నిర్మాతలు అందుకు సమ్మతించారట. అయితే… ఈ టీమ్ ముంబై వెళ్ళి సన్ని లియోన్ ను స్వయంగా కలిసి, ఆవిడతో టీజర్ ను విడుదల చేయించే సరికి మొత్తం ఖర్చు 16 లక్షలు అయినట్టు తెలుస్తోంది. కానీ సన్నిలియోన్ పుణ్యమా అని ఈ మూవీకి మంచి పబ్లిసిటీ దక్కింది, అలానే ఆ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. సినిమాల్లో నటించే కాకుండా ఇలానూ సన్నిలియోన్ బాగానే సంపాదిస్తోందని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-