తెలుగు, కన్నడ కుర్రాళ్ల కోసం మళ్లీ… సన్నీ ‘డియ్యో డియ్యో’!

మళ్లీ సన్నీ సౌత్ కొస్తోంది! తెలుగు, కన్నడ కుర్రాళ్ల గుండెల్లో ‘డియ్యో డియ్యో’మని మేళం మోగిస్తానంటోంది! మాజీ పోర్న్ స్టార్ ఐటెం నంబర్స్ విషయంలో ఫుల్ క్రేజీ అన్న సంగతి తెలిసిందే కదా… ఆమెని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటోన్న దక్షిణాది రసికులకి గుడ్ న్యూస్!

తెలుగులో ‘డియ్యో డియ్యో’ సాంగ్ చేసిన ఇండో-కెనడియన్ బ్యూటీ కన్నడంలోనూ కొన్ని చిత్రాల్లో హాట్ స్టెప్పులేసింది. అయితే, తాజాగా ‘కాటన్ పేటే గేట్’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ మీల్స్ తినిపించేందుకు సన్నీ సిద్ధమవుతోంది. సదరు కన్నడ సినిమా తెలుగులోనూ ‘సీతన్నపేట గేట్’గా రిలీజ్ చేయనున్నారు. ముగ్గురు కొత్త హీరోలు కలసి చేస్తోన్న ఈ సినిమాకి సన్నీ లియోనీ పెద్ద అట్రాక్షన్ గా మారుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

Read Also : “తిమ్మరుసు” స్టైలిష్ లుక్… ప్రోమో సాంగ్ కోసమట!

‘సీతన్నపేట గేట్’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఈ నెల చివర్లో సన్నీ హైద్రాబాద్ రానుంది. ఇక్కడే కన్నడ-తెలుగు బైలింగ్యువల్ సాంగ్ షూట్ చేస్తారట! నిజానికి ఈ పాట చీత్రకరణ మార్చీలోనే జరగాల్సింది. కానీ, కరోనా కారణంగా వీలు కాలేదు. ఇప్పుడు ఐటెం సాంగ్ కు రెడీ అవుతోన్న ఫిల్మ్ మేకర్స్ త్వరలోనే మూవీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. చూడాలి మరి, ‘కరెంట్ తీగ’ సినిమాలో గతంలో తెలుగు తెరపై కనిపించిన సన్నీ ఈసారి ఎలాంటి షాకిస్తుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-