అతియా, రాహుల్ లవ్ స్టోరీ : కూతురుకి నచ్చాడు, నాన్న మెచ్చాడు!

ప్రస్తుతం ఇటు బాలీవుడ్ సినీ ప్రేమికుల్ని, అటు క్రికెట్ లవ్వర్స్ ని ఆకర్షిస్తోన్న రొమాంటిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు… అతియా, కేఎల్ రాహుల్ లవ్ స్టోరీ! వాళ్లిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు తీవ్రంగా మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు, సునీల్ శెట్టి కూతురు అతియా తన ‘రూమర్డ్ బాయ్ ఫ్రెండ్’తో ప్రస్తుతం లండన్ లోనే ఉందట. అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచెస్ కి వెళ్లిన రాహుల్ తనతో బాటూ అతియాని తీసుకెళ్లాడు. ఆమెని అఫీషియల్ గా తన పార్టనర్ అని కూడా బీసీసీఐ వారితో పేర్కొన్నాడట!

Read also : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” రెస్పాన్స్ పై రాజమౌళి రియాక్షన్ !

వారసురాలి సరసాల గురించి సునీల్ శెట్టిని అడిగితే ఆయన నేరుగా ఏం స్పందించలేదు. అతియా లండన్ లో ఉన్నది వాస్తవమే అంటూ ఆమె తమ్ముడు అహాన్ శెట్టితో అక్కడ హాలీడే ఎంజాయ్ చేస్తోందని ముక్తాయింపు ఇచ్చాడు. రాహుల్ తో తన కూతురు లండన్ లో ఉందని సునీల్ ఒప్పుకోలేదు. అయితే, అతియా, రాహుల్ ఇద్దరూ కలసి చేసే ఒక యాడ్ గురించి ప్రస్తావించాడు. వారిద్దరూ ఇంటర్నేషనల్ ఐ బ్రాండ్ ప్రమోట్ చేయటం సంతోషంగా ఉందని అంటూనే ‘అతియా, రాహుల్ తెరపై చూడముచ్చటగా ఉంటారు’ అనేశాడు! ఈ స్టేట్మెంట్ తో ఇప్పుడు బాలీవుడ్ లో సునీల్ శెట్టి కూతురు ప్రేమ వ్యవహారం మరింత పెద్ద చర్చగా మారింది! రాహుల్, అతియాని సునీల్ శెట్టి ‘గుడ్ లుకింగ్ కపుల్’ అన్నాడని ప్రచారం సాగుతోంది. తండ్రి కూతురు ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంటున్నారు బీ-టౌన్ జనం!

ఆ మధ్య కొడుకు అహాన్ తో క్రికెటర్ రాహుల్ కలసి ఉన్న వీడియో పోస్ట్ చేసిన సునీల్ శెట్టి ‘మై లవ్, మై స్ట్రెంగ్త్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు! నాకు బాగా నచ్చిన క్రికెటర్స్ లో రాహుల్ కూడా ఒకరు అని రీసెంట్ గా పొగిడేశాడు! చూస్తుంటే ప్రేయసి అతియానే కాదు… మామగారు సునీల్ శెట్టిని కూడా కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ చేసినట్టే ఉన్నాడు! చూడాలి మరి, మన వాడు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటింపబడతాడో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-