రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్

జోహన్నెస్ బర్గ్‌ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్‌ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్‌ ఎల్గార్‌ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్‌ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్‌ ఎల్గార్ సులభంగా సింగిల్స్‌ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ వ్యాఖ్యానించాడు.

Read Also: పాకిస్థాన్ ఆటగాడికి ధోనీ బహుమతి

మరోవైపు దక్షిణాఫ్రికా విజయం పూర్తిగా ఎల్గార్ సొంతమని… అతడి వల్లే జోహన్నెస్ బర్గ్‌లో సఫారీ జట్టు గెలిచిందని గవాస్కర్ తెలిపాడు. పిచ్ కూడా ఆ టీమ్‌కు ఎంతో సహకరించిందన్నాడు. సాధారణంగా వాండరర్స్ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని.. అయితే నాలుగో రోజు వర్షం పడటం వల్ల పిచ్‌ను రోలింగ్ చేశారని.. దీంతో బౌలర్లకు బౌన్స్ లభించలేదని.. పైగా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిందన్నాడు. ఛేదన సమయంలో లక్ష్యం ఎంత ఉన్నా క్రీజులో పాతుకుపోవడం ముఖ్యమని… ఎల్గార్ ఈ విషయం సక్సెస్ అయ్యాడని సన్నీ అభినందించాడు. కాగా మూడో టెస్టులో కెప్టెన్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే కోహ్లీ రాకతో రహానె లేదా విహారిలలో ఒకరిని జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Latest Articles