మెంటార్ గా ధోని… అదే సమస్య : గవాస్కర్

యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు నిన్న భారత జట్టును ప్రకటించింది బోర్డు. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ధోనిని ఎంపిక చేసింది. ఇక ఈ విషయం పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనిని ప్రపంచ కప్ జట్టుకు మెంటార్ గా నియమించడం మంచి విషయం. ధోని జట్టులో ఉండటంతో ఆటగాళ్లకు కొత్త ఉత్సహం వస్తుంది. కానీ ఈ విషయంలో ఒకే ఒక సమస్య ఉంది. ఏంటంటే… జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి.. అలాగే ధోనికి మధ్య విబేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జట్టు కూర్పులో కానీ… లేదంటే ఆటగాళ్లకు సూచనలు ఇచ్చే సమయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చేందుకు అవకాశం ఉంది. దాని ప్రభావం పూర్తి జట్టు పైన పడుతుంది. అది మంచిది కాదు. కానీ ఒకవేళ ఈ ఇద్దరు ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం అది జట్టుకు ఎంతో మేలు చేస్తుంది అని ఈ లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-