కరోనాతో ‘చిప్కో’ సుందర్‌లాల్‌ బహుగుణ మృతి

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసా గుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్ లాల్ బహుగుణ ఇవాళ మృతి చెందారు. కొన్ని రోజుల కింద కరోనా బారిన పడ్డ బహుగుణ.. రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చేరి వైద్యం పొందు తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఇక సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపై, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ,అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేస్తూ, తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ పర్యావరణ రంగానికి తీరని లోటని,సీఎం కెసిఆర్ అన్నారు. బహుగుణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-