గుడ్ న్యూస్ : వేసవి సెలవులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను పోడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను మ‌రో 10 రోజులు పొడిగిస్తూ కెసిఆర్ సర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే లాక్‌డౌన్‌ను పొడిగించిన నేప‌థ్యంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 15వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వుల‌ను పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేరకు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే డైట్ కాలేజీల‌కు కూడా 15 వ‌ర‌కు సెల‌వులు పొడిగించారు. ఇక తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ పొడిగింపుతో వేస‌వి సెల‌వుల‌ను పొడిగించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-