మణిరత్నం అలా చేయడంతో చాలా ఫీలయ్యా- సుకుమార్

‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ..ప్రస్తుతం ‘పుష్ప’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ ని ముగించుకున్న సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సుకుమార్ కి నచ్చిన డైరెక్టర్ మణిరత్నం అని ఆయన చాలా స్టేజిలపై చెప్పారు. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పుడు మణిరత్నం చేసిన పనికి ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చారు.

” నాకు మణిరత్నం అంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా నాపై ఎంతో ప్రభావం చూపించింది. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చాను. ఆ సినిమా హల నుంచి బయటికి వచ్చేటప్పుడు.. నా గర్ల్ ఫ్రెండ్ ని వదిలి వచ్చినట్లు భాద ఉండేది. ఎప్పటికైనా మణిరత్నం గారిని కలవాలని అనుకునేవాడిని. ‘ఆర్య’ సినిమా తరువాత ఆయన ఒకసారి హోటల్ లో కనిపించారు. అప్పుడు ఆయన, శోభన గారితో సీరియస్ మీటింగ్ లో ఉన్నారు. చాలాసేపు ఆ మీటింగ్ అవుతుందేమోనని వెయిట్ చేశాను. కానీ, ఎంతసేపటికి అవ్వకపోయేసరికి నేనే కొద్దిగా చొరవ చేసుకొని సార్.. అని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయబోయాను. ఆయన నా వైపు కోపంగా చూస్తూ ‘వెళ్లూ’ అన్నట్టుగా చేయి ఊపారు. దాంతో నేను చాలా ఫీల్ అయ్యాను. నా ఫేవరెట్ డైరెక్టర్ ఆలా చేయడంతో చాలా రోజులు ఆ బాధలోనే ఉండిపోయాను. ఆ తరువాత నేను దర్శకుడిగా మారాక.. ఒక దర్శకుడు ఒక ఆర్టిస్ట్ తో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవరైనా కదిలిస్తే ఎంతటి అసహనంగా ఉంటుందో తెలుసుకున్నాను. అప్పుడు మణిరత్నం గారు ఆలా చేయడంలో తప్పులేదని అర్థమైంది. ఈసారి ఎలాగైనా ఆయనను కలిసే ప్రయత్నం చేస్తాను” అని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా మన లెక్కల మాస్టర్ కి ఈ చేదు అనుభవం మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతుంది.

Related Articles

Latest Articles