షాకింగ్ : సినీ ఫక్కీలో మోసపోయిన “సాహో” బ్యూటీ…!

200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కానీ ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు.

నిందితుడు కన్హార్ సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుండి కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు మంగళవారం తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో సోమవారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సాక్షిగా పరిగణిస్తూ ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది ఈడీ. ఇందులో సుకేష్ చంద్రశేఖర్ తన నిజమైన గుర్తింపును దాచి పెట్టాడని, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు.

Read Also : “సీటిమార్” ట్రైలర్ మార్మోగిపోతోంది !

జాక్వెలిన్ సుకేశ్‌ని నమ్మడం మొదలు పెట్టినప్పుడు,ఆమె ఖరీదైన పువ్వులు, చాక్లెట్‌లను అతనికి బహుమతిగా పంపడం ప్రారంభించిందట. ఈడీ అధికారుల వద్ద సుకేష్ కు సంబంధిచిన రెండు డజన్ల కంటే ఎక్కువ కాల్ రికార్డులు ఉన్నాయి. దాని ఆధారంగానే జాక్వెలిన్ కు జరిగిన మోసం గురించి తెలుసుకోగలిగారు. భద్రతా కారణాల దృష్ట్యా నటుడికి సుకేశ్ స్పూఫ్ కాల్‌ల వివరాలను ఏజెన్సీ వెల్లడించలేదు. తీహార్ జైలు నుండి కాల్ స్పూఫింగ్ ద్వారా సుకేశ్ మరో ప్రముఖ మహిళా సెలబ్రిటీని కూడా తన లక్ష్యంగా చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత వారం ఈడీ చెన్నైలోని సుమన్ చంద్రశేఖర్‌కు చెందిన ఒక బంగ్లాపై దాడి చేసింది. ఢిల్లీ జైలులో విచారణలో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఒక వ్యాపారవేత్త నుండి సంవత్సరం వ్యవధిలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతడిపై 20 కి పైగా ఇతర దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. పైగా జైలు లోపల నుండి సుమన్ ఇంత పెద్ద రాకెట్‌ను నిర్వహించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) కింద సుకేశ్ చంద్రశేఖర్ రిమాండ్ మరో నాలుగు రోజులు పొడిగించారు. ప్రస్తుతం అతను పోలిసుల కస్టడీలో ఉన్నాడు. కాగా జాక్వెలిన్ “సాహో” చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో కన్పించిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-