మహబూబాబాద్‌లో సుపారీ గ్యాంగ్ హల్‌చల్

డబ్బుల కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్న రోజులవి. మహబూబాబాద్ జిల్లాలో ఓ సుపారీ ముఠా హల్ చల్ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కు యత్నించిన ఆ ముఠా సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు.. వారిని పట్టుకొని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ సంఘటన మహబాబూబాద్ లోని సాలార్ తండా వద్ద జరిగింది.

రాకేశ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారులో సాలార్ తండా కు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఆరుగురు అజ్ఞాత వ్యక్తులు అక్కడికి చేరుకొని రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు గమనించి ఆ సుపారీ గ్యాంగ్ ను అడ్డుకున్నారు.

సినీ ఫక్కీలో కారుకు అడ్డం తిరిగి మరీ రాకేశ్ రెడ్డిని కాపాడారు. ఆ ముఠాలోని ముగ్గురిని పట్టుకొని చితకబాదారు. వీరి దెబ్బలకు భయపడిన మరో ముగ్గురు పరారయ్యారు. అనంతరం ఆదేకారులో ఆ గ్యాంగ్‌లోని ముగ్గుర్ని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించారు స్థానికులు. ఐతే ఈ సుఫారీ గ్యాంగ్ ఖమ్మం జిల్లా నుండి వచ్చినట్లు గుర్తించారు. వీరిని ఎవరు పంపారు? రాకేష్ రెడ్డిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారనేది పోలీసుల విచారణలో తేలనుంది. మొత్తం మీద ఈ సుఫారీ గ్యాంగ్ హల్ చల్‌తో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related Articles

Latest Articles