సుధీర్ బాబు… పసి హృదయం కాపాడాడు! మనసులు దోచుకున్నాడు!

తెరపైన హీరోయిజం ఈజీనే! దర్శకుడు చెప్పినట్టు నటిస్తే సరిపోతుంది. కానీ, రియల్ లైఫ్ లో హీరోగా ప్రవర్తించటం అందరి వల్లా కాదు. కానీ, టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు నిజ జీవితంలోనూ తన మంచి మనసు చాటుకున్నాడు. ఓ చిన్నారి గుండె కోసం తాను తపించాడు. ఎట్టకేలకు ఆ పాప ఇప్పుడు ప్రమాదం నుంచీ బయటపడింది. తన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం కూడా మన రియల్ హీరో బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తానని మాటిచ్చాడు!

కొన్నాళ్ల క్రితం బేబీ సంస్కృతి కోసం సుధీర్ బాబు ఒక ఫండ్ రైజర్ నిర్వహించాడు. ఇన్ స్టాగ్రామ్ లో సదరు చిన్నారి హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పాడు. ఆపరేషన్ చేయాల్సి ఉండటంతో సంస్కృతి కోసం సుధీర్ బాబు స్వయంగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించాడు. అయితే, మరిన్ని డబ్బులు అవసరం కావటంతో ఆ పాప కోసం మనీ డొనేట్ చేయాలనుకున్న వారు స్పందించాలని కోరాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం సంస్కృతి హార్ట్ సర్జరీ సక్సెస్ ఫుల్ గా ముగిసిందట. సుధీర్ బాబు స్వయంగా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారట. ముందు ముందు సంస్కృతి చదువు కోసం కూడా ఆయన ఓ ఫిక్డ్స్ డిపాజిట్ చేయనున్నారట!

సంస్కృతి అనే పాప కోసం సుధీర్ బాబు తపన చూసి… ఇదే మన భారతీయ సంస్కృతి అంటూ… ఆనందం వ్యక్తం చేస్తున్నారు సొషల్ మీడియా నెటిజన్స్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-