హెలికాప్టర్ ప్రమాదంపై సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు !

త‌మిళ నాడు రాష్ట్రంలో నిన్న మ‌ధ్యాహ్నం.. హెలికాప్ట‌ర్ పేలిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘోర ప్ర‌మాదంలో.. ఏకంగా.. బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో స‌హా.. 13 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశం విషాద ఛాయ‌లోకి వెళ్లింది. అయితే.. తాజాగా హెలికాప్ట‌ర్ సంఘ‌ట‌న‌పై వివాద‌స్ప‌ద రాజ్య స‌భ స‌భ్యులు సుబ్ర మ‌ణ్య స్వామి ఆస్త‌కి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై సుప్రీం కోర్టు రిటైర్ జ‌డ్జితో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేశారు.

”త‌మిళ నాడులోని కూనూర్ స‌మీపంలో జ‌రిగిన హెలికాప్ట‌ర్ భార‌త దేశ పు మొద‌టి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మ‌ర‌ణించారు. సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, అత‌ని భార్య అలాగే 11 మంది ఇత‌రులు మ‌ర‌ణించిన ఘ‌ట‌న షాకింగ్ అని.. దేశ భ‌ద‌త్ర‌త‌కు పెద్ద హెచ్చ‌రిక అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫైన‌ల్ రిపోర్టు రాలేదని.. కాబ‌ట్టి ఏదైనా చెప్ప‌డం చాలా క‌ష్టంగా ఉంది.. కానీ వాస్త‌వం ఏమిటంటే త‌మిళ‌నాడు లాంటి సేఫ్ జోన్ లో ఉన్న మిల‌ట‌రీ ఎయిర్ క్రాఫ్ట్ పేల‌డం ఆశ‌ర్య‌క‌రం” అని సుబ్ర‌మ‌ణ్య స్వామి పేర్కొన్నారు.

Related Articles

Latest Articles