చిత్తూరు జిల్లాలో ఆంక్ష‌లు మ‌రింత కఠినం…ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  క‌ట్ట‌డికి ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నా క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  దీంతో జూన్ 1 వ తేదీ నుంచి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.  రూర‌ల్ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  దీంతో ఆంక్ష‌ల‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌యింది.  జూన్ 1 నుంచి ఉద‌యం 6 గంట‌ల నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే స‌డలింపులు ఇవ్వాల‌ని, ఉద‌యం 10 గంట‌ల నుంచి తిరిగి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.   

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-