గోదావరి ఉగ్రరూపం.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్‌

తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడమే కాదు.. గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి.. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.. ఇక, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి… ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి వరద నీరు.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కందకుర్తి బ్రిడ్జిపై నుంచి వెళ్తోంది.. ఆ ప్రవాహానికి బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించడం కష్టంగా మారింది.. దీంతో.. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.

Related Articles

Latest Articles

-Advertisement-