ఇప్పటికైనా మంచి నిర్ణయాలుతీసుకోవాలి:సత్యవతి రాథోడ్‌

ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలన మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రైతు లను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతు లను ఇబ్బంది పెడితే ఎవ్వరూ చూస్తు ఉరుకోరన్నారు. ఇప్ప టికైనా రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అన్నారు. బీజేపీప్రభుత్వం కొంతమంది వ్యక్తుల కోసం పనిచేస్తూ వారి సొంత లాభాల కోసమే పనిచేస్తుందన్నారు. తెలంగాణలో నీటి సౌలభ్యం ఉన్నందున రైతులు యాసంగి పంటను మాత్రమే వేస్తారని, వేరే పంటలు పండవు కాబట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె సూచిం చారు. ఏద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలోనే లేదన్నారు.

రైతు సమస్యలు తెలిసిన నాయకులు సంఘాలను పిలిచి మాట్లా డాలని ఆమె డిమాండ్‌ చేశారు. లక్షల కోట్ల రూపాయలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యక్తుల ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతుం దన్నారు. బ్యాంకు రుణాలు ఏగొట్టి విదేశాలకు పారిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. రైతులను ఇప్పటికైనా ఇబ్బందులు పెట్టకుండా రైతు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభు త్వం కట్టుబడి ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు పై కేంద్రం ప్రకటన చేయాలని మంత్రి సత్యవతి అన్నారు.

Related Articles

Latest Articles