తెలంగాణ ఐటీ, పరిశ్రమల వార్షిక నివేదికలు విడుదల

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖల 2020-21 సంవత్సర వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఎవరు మమ్మల్ని అడగలేదు..కానీ పారదర్శకత కోసం వార్షిక నివేదికలను విడుదల చేస్తూ ఉన్నామన్నారు. కేసీఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని.. దేశ పౌరుని సగటు తలసరి ఆదాయం 1,27,768 ఉంటే …తెలంగాణ రాష్ట్ర పౌరుని తలసరి ఆదాయం 2,27,145గా ఉందని తెలిపారు. 2020-21లో తెలంగాణ ఐటి రంగం ఎగుమతులు 1 లక్ష 45 వేల కోట్లు అని..రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఐటి ఎగుమతుల విలువ 57 వేల కోట్లు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 80 శాతం పెట్టుబడిదారులు.. మళ్ళీ ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారన్నారు. టీఎస్ఐసీసీ 10 ఇండస్ట్రియల్ పార్క్ లు కొత్తగా ఏర్పాటు చేసిందని..తెలంగాణలో అమెజాన్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

గత ఏడాది ఎన్నో పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని.. టి హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, వి హబ్ లు మంచి ఫలితాలు అందిస్తున్నాయని వెల్లడించారు. కొత్త టెక్నాలజీకి పాలసీ విషయంలో తెలంగాణ ముందు ఉందని.. ఎస్ఎమ్ఈలు కరోనా వల్ల దెబ్బతిన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాటిని ఆదుకోవాలని.. ఎస్ ఎమ్ఈల ఉద్దీపన కోసం 20 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం గతంలో ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది పలు లక్ష్యాలతో ముందుకు సాగుతామని..ఐటీని ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. టి హబ్ ఫేస్-2 ను ప్రారంభిస్తామనీ.. ఎలక్ట్రానిక్ రంగంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తామని.. కరోనాతో ఇబ్బందులలో ఉన్న చిన్న, మధ్య, తరహా పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-