‘స్టార్ టూర్స్’… డిస్నీ లాండ్ లో సైన్స్ ఫిక్షన్ సర్ ప్రైజ్!

అమెరికా అంటే ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయం. కానీ, సినిమా ప్రియులకి మాత్రం… హాలీవుడ్డే! యూఎస్ అనగానే భారీ బడ్జెట్ తో నిర్మించే హాలీవుడ్ చిత్రాలానే చాలా మంది గుర్తు చేసుకుంటారు. అయితే, ప్రపంచంలోని చాలా చిన్న చిన్న దేశాలు లేదా వెనుకబడిన దేశాల వార్షిక బడ్జెట్ కంటే కూడా కొన్ని హాలీవుడ్ చిత్రాల పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది! అంత భారీగా సినిమాల్ని వాళ్లు ఎలా తీస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికాలో ఆర్ట్ ని బిజినెస్ గా, బిజినెస్ ని ఓ ఆర్ట్ గా నిర్వహిస్తారు! సినిమాలో ఎంత క్రియేటివిటి చూపిస్తారో అంతే తెలివిగా మార్కెట్ చేసుకుని సొమ్ము చేసుకుంటారు. అందుకే, హాలీవుడ్ చిత్రాలకు ఎంత డబ్బు పెట్టినా అంతకు పది రెట్లు తిరిగి వస్తుంటుంది. జార్జ్ లూకాస్ రూపొందించిన ‘స్టార్ వార్స్’ అటువంటి ఫ్రాంఛైజే!

చాలా దశాబ్దాల క్రితం ‘స్టార్ వార్స్’ చిత్రాలు మొదలయ్యాయి. ఇప్పుడు మనం చూసే సైన్స్ ఫిక్షన్ సినిమాలకి అనాటి వాటికి చాలా తేడా ఉంటుంది. అయినా కూడా అప్పట్లో అవే పెద్ద సంచలనం! అయితే, అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంత తెలివైన వారంటే… ‘స్టార్ వార్స్’ విడుదలైన కొద్ది రోజులకే ఎంటర్టైన్మెంట్ పార్క్ మొదలెట్టేశారు. డిస్నీ లాండ్ లో ‘స్టార్ వార్స్’ థీమ్ తో ఏళ్ల తరబడి వినోదం నడిచింది. రియల్ గా ‘స్టార్ వార్స్’ మూవీలో చూపిన విధంగా భూమిని దాటి బయటకి వెళ్లిపోయిన ఫీలింగ్ ఆ పార్క్ లో అతిథులకి కలుగుతుంది! దాదాపు 20 ఏళ్లు పెద్దగా మార్పులు లేకుండా సాగిన డిస్నీ లాండ్ లోని స్టార్ టూర్స్ కి 2011లో కొత్త హంగులు ఏర్పాటు చేశారు.

అప్ గ్రేడ్ తరువాత స్టార్ టూర్స్ చేసే వారికి మరింత ఎంటర్టైన్మెంట్, మరింత థ్రిల్ పెరిగిపోయాయి. ‘స్టార్ వార్స్’ డైరెక్టర్ జార్జ్ లూకాస్ సినిమాని రూపొందించటమే కాదు వ్యాపారంలోనూ తన క్రియేటివిటి చూపాడు. డిస్నీ లాండ్ కు వచ్చే వారికి ‘స్టార్ వార్స్’ నేపథ్యంలో వివిధ రకాలు వినోదాలు, విస్మయాలు అందించటంలో ఆయనదే ప్రధాన పాత్ర. జార్జ్ లూకాస్ సృజనాత్మకత ఎలా ఉంటుందో మనకు ఒక చిన్న అంశం గమనిస్తే తెలిసిపోతుంది… స్టార్ టూర్స్ చేసేవారికి కొంత సేపు గడిచాక ఓ సర్ ప్రైజ్ ఎదురవుతుంది! అదేంటంటే… సినిమాలో చూపినట్టుగా ఇక్కడ కూడా జనంలోని ఎవరో ఒకర్ని ‘రెబెల్ స్పై’గా గుర్తిస్తారు!

వారి ఫోటో పెద్ద స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తారు! చాలా వరకూ అక్కడ ఉన్న ఎవరో ఒకరు చిన్న పిల్లల్ని దీని కోసం ఎంచుకుంటారు! అలా చేస్తారని ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల అది అందరికీ సర్ ప్రైజే! ‘రెబెల్ స్పై’గా సెలెక్టై తెర మీద తమని తాము చూసుకున్న వారికైతే మరింత థ్రిల్! ఇలాంటివి అనేకం డిస్నీ లాండ్ లోని స్టార్ వార్స్ థీమ్ పార్క్ లో మనకు ఎదురవుతాయి! జీవితంలో ఒక్కసారైనా ఎంజాయ్ చేయాల్సిన రైడ్ స్టార్ టూర్స్ అనటంతో సందేహం లేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-