బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ ని కలవనున్న రాజమౌళి..?

టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి రసవత్తరంగా మారుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఆ మూడు కూడా స్టార్ హీరోలవి కావడమే గమనార్హం. ముందు నుంచి చెప్తునట్లే ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7 ని ఫిక్స్ చేసుకొంది.. ఇకజనవరి 12 న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వస్తుండగా.. జనవరి 14 న ‘రాధే శ్యామ్’ రానుంది. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి బరిలో దిగాక.. మిగతా సినిమాలన్నీ పక్కకు వెళ్లిన సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న విషయం విదితమే.. బాలీవుడ్ సైత జక్కన్న మాటను కాదనలేక కొన్ని సినిమాలను డ్రాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. భీమ్లా నాయక్ కూడా వెనక్కి తగ్గుతోంది అనే వార్తలు గుప్పుమంటున్న సమయంలో అస్సలు తగ్గేది లేదు అంటూ చిత్ర నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా రిలీజ్ డేట్ ని చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే భీమ్లా నాయక్ ని వెనక్కి తగ్గమని అడగడానికి స్వయంగా రాజమౌళినే బయల్దేరనున్నాడంట.

రిలీజ్ డేట్ గురించి మాట్లాడడానికి జక్కన్న, పవన్ కళ్యాణ్ ని కలిసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల గుసగుసలు.. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నోసార్లు వాయిదా పడుతూ చివరికి సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు ఏ సినిమాను అడ్డురానివ్వకుండా చేసే పనిలో పడ్డాడంట రాజమౌళి. ఇకపోతే మరోపక్క భీమ్లా నాయక్ దర్శకులు సైతం అస్సలు తగ్గేది లేదని, తాము కూడా సంక్రాంతి బరిలోనే దిగుతున్నామని పలుమార్లు గట్టిగానే చెప్పుకొచ్చారు. మరి రాజమౌళి – పవన్ మీటింగ్ తరువాత ఎటువంటి నిర్ణయం రానున్నదో చూడాలి. జక్కన మాటకు పవన్ తల వంచుతాడా..? లేక రాజమౌళితోనే ఢీ కొడతాడా..? అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles