మెగా ఛాన్స్ కొట్టేసిన ‘సలార్’ బ్యూటీ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఆచార్య, గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో మెగా 154 కూడా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తున్నదంట. ‘క్రాక్’ హిట్ తో ట్రాక్ ఎక్కిన ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన ‘సలార్’ లో నటిస్తోంది.

ఇది కాకుండా బాలయ్య సరసన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ముద్దుగుమ్మ మెగా ఆఫర్ ని అందుకున్నదని వార్తలు గుప్పుమన్నాయి. మెగా 154 లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందంట.. ఈ చిత్రంలో చిరు అండర్ కవర్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఫైనల్ టాక్స్ దశలో వున్న ఈ డీల్ త్వరలోనే ఫినిష్ అయిపోతుందని, శృతి సైతం ఈ ఆఫర్ ని ఒడిసిపట్టిందని టాక్. దీంతో త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. మరి శృతి, చిరు ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles