మమ్ముట్టి, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా… 23 ఏళ్ల క్రితం!

వాళ్లిద్దరూ మలయాళ సూపర్ స్టార్స్… వీరిద్దరూ బాలీవుడ్ క్రేజీ కపుల్! కానీ, అందరూ ఒకే చోట కలిశారు! అందుకే, ఆ మల్లూవుడ్ కమ్ బాలీవుడ్ గ్రూప్ ఫోటో ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా క్లిక్ చేసి చూస్తున్నారు. ఇంతకీ, మోహన్ లాల్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, జూహి చావ్లా ఒకేసారి, ఒకే చోట ఎందుకు కలిశారా? ప్రత్యేకంగా వారి పిక్ ని ఎవరు తీశారు?

1998లో మమ్ముట్టి, మోహన్ లాల్ ఒక సినిమాలో కలసి నటించారు. అదే ‘హరికృష్ణన్స్’. ఈ మల్టీ స్టారర్ లో హీరోయిన్ గా నటించింది బీ-టౌన్ బ్యూటీ జూహీ చావ్లా. అయితే, ‘హరికృష్ణన్స్’ సినిమా కామెడీగా సాగే డిటెక్టివ్ థ్రిల్లర్. అందులో ఇద్దరు హీరోలకి, హీరోయిన్ కి మధ్య ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ నడుస్తుంది. మరి క్లైమాక్స్ ఎలా? దర్శకుడు ఫాజిల్ లాస్ట్ ట్విస్ట్ కోసం షారుఖ్ ని తీసుకొచ్చాడట! ఆయన జూహీని పెళ్లాడటంతో సినిమా ముగుస్తుంది! కానీ, థియేటర్స్ కి వచ్చిన ‘హరికృష్ణన్స్’ మూవీ వర్షన్ లో ప్రేక్షకులకి బాలీవుడ్ బాద్షా కనిపించలేదు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ముందు అనుకున్న విధంగా ఎండింగ్ ఇవ్వలేకపోయారట. కానీ, అప్పుడు తీసిన ఫోటో మాత్రం అలాగే ఉండిపోయింది. అది కాస్తా ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-