పుష్ప : ఆకట్టుకుంటున్న ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప’ చిత్రం నుంచి తాజాగా సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆ తరువాత సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అంటూ సాగిన సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 20 సెకండ్ల ఈ ప్రోమో సాంగ్ పై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పూర్తి సాంగ్ ను వినడానికి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ‘శ్రీవల్లి’ పూర్తి పాట రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల అవుతుంది.

Read Also : దసరాకు సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ కానుక

శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్’ 2021 డిసెంబర్ 17 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

-Advertisement-పుష్ప : ఆకట్టుకుంటున్న 'శ్రీవల్లి' సాంగ్ ప్రోమో

Related Articles

Latest Articles