‘సలార్’ సరసన ‘కోబ్రా’ బ్యూటీ!

కొన్ని అనుబంధాలను అంత తేలిగ్గా వదులుకోవడం దర్శకుల వల్ల కాదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ విషయంలో అదే జరుగుతోంది. ప్రముఖ మోడల్ శ్రీనిధి శెట్టిని ‘కేజీఎఫ్’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. ఆ సినిమాలో అమ్మడి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా… ఆడియెన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేలా చేసింది శ్రీనిథి శెట్టి. అయితే తొలి భాగంలో కంటే త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో ఆమె పాత్రకు మరింత స్కోప్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కన్నడ కస్తూరి విక్రమ్ తమిళ చిత్రం ‘కోబ్రా’లో నటిస్తోంది. విశేషం ఏమంటే… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ మూవీని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు అందులో ఐటమ్ సాంగ్ కు శ్రీనిధి శెట్టినే ఎంపిక చేశాడట. నిజానికి ఈ విషయమై గతంలోనే వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు దాదాపుగా ఆమె ఎంపిక ఖాయమైపోయిందని అంటున్నారు. కొవిడ్ 19 కారణంగా షూటింగ్ వాయిదా పడిందని, కరోనా తగ్గు ముఖం పట్టగానే ప్రభాస్, శ్రీనిధి మీద ఐటమ్ సాంగ్ తీస్తారని యూనిట్ సభ్యులు అంటున్నారు. అందం, అభినయంలో సాటి అయిన శ్రీనిధి శెట్టి ఈ ఐటమ్ సాంగ్ తో మాస్ ఆడియెన్స్ కు మరింత చేరువ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.

Related Articles

Latest Articles

-Advertisement-