పూర్తి స్థాయిలో వెండితెరపైకి శ్రీకాంత్ కుమార్తె!

శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే బాల నటుడిగానే కాకుండా యువ కథానాయకుడిగానూ ‘నిర్మలా కాన్వెంట్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాస్తంత గ్యాప్ తీసుకుని సెప్టెంబర్ మాసంలో ‘పెళ్ళి సందడి’తో మరోసారి హీరోగా సందడి చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… శ్రీకాంత్, ఊహ కుమార్తె మేథ సైతం త్వరలో పూర్తి స్థాయిలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోందట.

గతంలో గుణశేఖర్ రూపొందించిన ‘రుద్రమదేవి’ చిత్రంలో బాలరుద్రమగా శ్రీకాంత్ కూతురు మేథ నటించింది. ఆ సినిమాలో రోషన్ చిన్నప్పటి రానా పాత్ర చేయగా, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు సహిదేవ్ విక్రమ్ చిన్నప్పటి అల్లు అర్జున్ (గోన గన్నారెడ్డి) పాత్ర చేశాడు. రోషన్ తో పాటు సహిదేవ్ సైతం ఇప్పుడు హీరోగా ఎదిగిపోయాడు. ఆ క్రమంలోనే మేధ కూడా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా సినిమా చేయబోతున్నట్టు సమాచారం. సహజంగా మన స్టార్స్ తమ కుమార్తెలను హీరోయిన్లుగా చేయడానికి పెద్దంతగా ఇష్టపడరు. కానీ అటు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ, ఇటు నాగబాబు కుమార్తె నిహారిక వంటి వారు ఆ హద్దుల్ని దాటుకుని ముందుకొచ్చారు. మరి నాట్యంలోనూ ప్రావీణ్యం ఉన్న శ్రీకాంత్ కూతురు మేథ కూడా హీరోయిన్ గా నటించి, రాణిస్తుందేమో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-