ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ‘ఇక్షు’ సమ్ థింగ్ స్పెషల్!

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాం అగ్నివేష్ కథానాయకుడిగా డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన సినిమా ‘ఇక్షు’. రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఋషిక దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీయార్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని ఎన్టీయార్ డైలాగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ”ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం. ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి గెటప్ వేసుకొని చెప్పడం ఇంకా బొప్ప విషయం. ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ పోస్టర్ నేను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది” అన్నారు. హీరో శ్రీకాంత్ ఈ సినిమాకు సంబంధించిన చిన్ని చిన్న కరెక్షన్స్ చెప్పారని, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మూవీని మరింత పకడ్బందీగా తీర్చిదిద్ద జనం ముందుకు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-