షాకింగ్: సిరి- శ్రీహన్ కూడా బ్రేకప్..?

బిగ్ బాస్ సీజన్ 5 ఎంతటి రసవత్తరంగా సాగిందో.. బయటికి వచ్చాక అందులోని కంటెస్టెంట్ల లవ్ స్టోరీస్ కూడా అంతే రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్స్ గా, ప్రేమికులుగా ఉన్న షన్ను- దీపు కొద్దీ రోజులో పెళ్లి చేసుకుంటారు అనే సమయంలో షన్ను బిగ్ బాస్ కి వెళ్ళాడు. అక్కడ సిరితో మంచి రొమాన్స్ చేశాడు. అయితే అదంతా ఫ్రెండ్ షిప్ అని వారు చెప్పుకున్నా కొన్ని బంధాలు హద్దులు దాటకూడదని తెలుపుతూ దీప్తి, షన్నుకు బ్రేకప్ చెప్పేసింది. ఇక దీనికి కారణం సిరిని అంటూ పుకార్లు వచ్చినా వాటిపై ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. అలా వారు అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాకా సిరి- శ్రీహన్ లు కలిసింది లేదు. అంతకుముందులా వారు మెలిగింది లేదు. ఇక తాజాగా శ్రీహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఉన్న ఫొటోలన్నింటిని డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేవలం వారిద్దరూ కలిసి పనిచేసిన వెబ్ సిరీస్ పోస్టర్లు తప్ప పర్సనల్ గా సిరితో ఉన్నాయి, సిరి సింగిల్ ఫోటోలు అన్నింటిని శ్రీహన్ డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య కూడా బ్రేకప్ అయ్యిందని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. త్వరలోనే షన్ను- దీపు లా వీరు కూడా బ్రేకప్ ప్రకటిస్తారేమో చూడాలి.

Related Articles

Latest Articles