పిసిసి అనేది ఏఐసీసీ పరిధిలోని అంశం..నేను పిసిసి రేసులో లేను!

పిసిసి నియామకంపై మాజీ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పిసిసి అనేది ఏఐసీసీ పరిధిలోని అంశమని.. నేను పిసిసి రేసులో లేనని పేర్కొన్నారు. తనకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు.. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. పిసిసి ఎవరికి ఇవ్వాలన్నది ఏఐసీసీకి తెలుసు అని తెలిపారు. అంతకు ముందు భూముల అమ్మకంపై కెసిఆర్ సర్కార్ పై శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ప్రజల సంపదని..ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని.. 30 వేల ఎకరాలను అమ్ముకోవాలని వేలం వేస్తుందన్నారు. భూముల అమ్మకం ఉప సంహరించుకోవాలని..తెలంగాణ ఇచ్చింది భూములు అమ్ముకోవాలని ఇవ్వలేదని మండిపడ్డారు. సంపద తెలంగాణకు దక్కాలని సోనియా రాష్ట్రం ఇచ్చింది.. మిగులు రాష్ట్రం ఇస్తే.. అప్పుల తెలంగాణగా మార్చేసిందని టీఆర్ఎస్ అని మండిపడ్డారు. హరీష్ రావు… మేమే అమ్మినమా… కాంగ్రెస్ అమ్మలేదా..? అంటున్నారని..
తెలంగాణ భూములు… ఇతర ప్రాంతాల వారు కొంటున్నారు అనే మేము అదుపు చేశామని చురకలు అంటించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-