‘శ్రీదేవి సోడా సెంటర్’ స్నీక్ పీక్ రిలీజ్!

సుధీర్ బాబు హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ రూపొందిస్తున్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. 70 ఎం. ఎం. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘మందులోడా’ అంటూ సాగే ఓ మాస్ కా బాస్ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. శుక్రవారం 9 గంటలకు జనం ముందుకు ఈ లిరికల్ వీడియో రాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఇంటికి చిత్రబృందం వెళ్ళింది. పాటను విడుదల చేయడంతో పాటు దానిని చూసి ఎంజాయ్ చేసిన చిరు… కరుణ కుమార్ తొలిచిత్రం ‘పలాస’లో ‘నాది నక్కిలీసు గొలుసు’ను మించి ఇందులోని ఈ పాట సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మరి రేపు ఉదయం విడుదలయ్యే పాట ఏ స్థాయిలో శ్రోతలను ఆకట్టుకుంటుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-