ముందు ‘నల్ల వంతెన’… తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’

సుధీర్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్ ను పూర్తి స్థాయిలో మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్. 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు విజయ్ చిల్లా. శశిదేవరెడ్డి. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ చిత్రానికి యు.ఎ సర్టిఫికెట్ లభించిందని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని నిర్మాతలు అంటున్నారు. ఆగస్ట్ 27న విడుదల అవుతున్న సందర్బంగా నిర్మాతలు ముచ్చటించారు.

ఆదిలో అడ్డంకులు…

కరుణకుమార్ చెప్పిన కథ తమకు బాగా నచ్చిందని పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతే షూటింగ్ ఆరంభించాము. అయితే ఆరంభంలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. తొలిరోజే షూటింగ్ కెమెరా క్రిందపడిపోయింది. లక్కీగా కెమెరాకు ఏం కాలేదు. రెండో రోజు కారవాన్ డ్రైవర్ కి షాక్ కొట్టింది. ఇలా వరుసగా ఏదో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. దాంతో చాలా కంగారు పడ్డాము. ఓ వారం తర్వాత సాఫీగా షూటింగ్ జరిగింది. ఇక షూటింగ్ మధ్యలో నా సోదరుడు చనిపోవడం పెద్ద షాక్ అని చెప్పారు విజయ్ చిల్లా.

ఫస్ట్ లుక్ తోనే క్రేజ్

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగానే బిజినెస్ ఎంక్వయిరీలు మొదలయ్యాయట. అయితే సుధీర్ బాబు ఫస్ట్ గ్లింప్ల్స్ రిలీజ్ తర్వాత ఆ క్రేజ్ పీక్స్ కి వెళ్ళిందట. అలా సినిమా పూర్తి కాకముందే మొత్తం అన్నిఏరియాల నుంచి క్రేజీఆఫర్స్ పలకరించాయంటున్నారు విజయ్. ప్రత్యేకించి తమ సినిమాలో పాటలు ఒక్కటొక్కటిగా విడుదలవుతున్న కొద్దీ సినిమాక్రేజ్ అమాంతం పెరిగిందట. ముందులోడా పాట నుంచి చుక్కలమేళం పాట వరకూ ప్రతి పాట హిట్ అయిందని అందుకు కారణమైన మణిశర్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా మణిశర్మ ఎంపిక తన ఛాయిసే అన్నారు విజయ్.

మంచి కథలకే ప్రాధాన్యం

మంచి కథలు దొరికితేనే తమ బ్యానర్ లో సినిమాలుగా తీస్తామంటున్నారు నిర్మాతలు విజయ్, శశి. ‘భలే మంచి రోజు’ తర్వాత ప్రేమకథలతో… ‘ఆనందోబ్రహ్మ’ తర్వాత వరుసగా హారర్ కథలతో రచయితలు, దర్శకులు తమ వద్దకు వచ్చారని, ఇక ‘యాత్ర’ తర్వాత బయోపిక్స్ స్క్రిప్ట్ లతో వచ్చారని అయితే తాము తీసిన ముందు సినిమాల జానర్స్ కంటే బెటర్ అనిపించినప్పుడే సినిమాలు మొదలు పెట్టామంటున్నారు. తమకు కథ ముఖ్యమని అందుకే ‘యాత్ర’ తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ తీయటానికి ఇంతటైమ్ పట్టిందట.

ముందు ‘నల్ల వంతెన’… తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’

నిజానికి ఈ సినిమా టైటిల్ గా ముందు ‘నల్ల వంతెన’ అనుకున్నారట. అయితే ఇందులో కథ మొత్తం శ్రీదేవి సోడా సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుందట. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశామని చెబుతున్నారు నిర్మాతలు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా అనేది ఇంకా నిర్ణయించలేదని, రెండు మూడు కథలు విన్నామని ప్రస్తుతం మాత్రం పూర్తిగా ఈ సినిమా ప్రచారంపైనే దృష్టి పెట్టామంటున్నారు. ఈ సినిమా ప్రచారం విషయంలో మహేశ్ బాబు, ప్రభాస్ సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.

భారీ స్థాయిలో విడుదల

కరోనా పాండమిక్ తర్వాత భారీ స్థాయిలో విడుదల చేస్తున్న సినిమా తమదే అన్నారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 500లకు పైగా థియేటర్లలోను, యుస్ లో 120కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నామని, యుస్ లో ఇండివిడ్యువల్ షోలకు కూడా అనుమతి ఇస్తున్నామన్నారు. ఈ సినిమా ఆరంభం నుంచి ఇప్పటి వరకూ తమకు పూర్తి సహాయసహకారాలు అందించిన హీరో సుధీర్ బాబుకు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

-Advertisement-ముందు ‘నల్ల వంతెన’… తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’

Related Articles

Latest Articles