మహేష్.. మహేష్ అని కలవరిస్తున్న బ్యూటీ..

‘పెళ్లి సందడD’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బెంగళూరు బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల్లో పడిన అమ్మడు ఈ సినిమా తరువాత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ చిన్నది.. ఆ హీరో ఈ హీరో కాదు ఏకంగా మహేష్ బాబుతోనే నటిస్తాను అని చెప్పుకుంటూ తిరుగుతుందట. అంటే మహేష్ బాబు తో ఆఫర్ వచ్చేవరకు అందరికి మహేష్ తో నటించడం నా డ్రీమ్ అని చెప్తోంది అన్నమాట.

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లు.. కుర్ర హీరోల దగ్గరే ఆగిపోతున్నారు.. మరి ఒక్క సినిమాకే మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ ఎలా కొట్టేస్తావ్ అంటూ పలువురు శ్రీ లీల ను ప్రశ్నిస్తున్నారట. ఇక అమ్మడి కల నెరవేర్చుకోవాలంటే ఒకటే ఒక ఆప్షన్ ఉంది. అదే మహేష్ కళ్లలో పడడం. హీరోయిన్ గ్లామరస్ ఉండి .. కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకుంటే స్టార్ హీరోల సరసన అవకాశం రావడానికి ఎంతో కాలం పట్టడం లేదు. ఇక అవకాశాలతో వరుసగా కుర్ర హీరోలను లైన్లో పెట్టి మహేష్ కళ్ళలో పడితే తప్ప శ్రీ లీల కోరిక నెరవేరదు. మరి ఈ విషయాన్ని అమ్మడు అర్ధం చేసుకొని వచ్చిన అవకాశాలను ఒడిసిపడుతుందో.. లేక మహేష్.. మహేష్ అంటూ నిర్మాతలకు తలనొప్పిగా మారుతుందో చూడాలి.

Related Articles

Latest Articles