శ్రీముఖి శ్రీవారి ఇంట్లో కుడి కాలు పెట్టేస్తుందా?

గతేడాది లాక్ డౌన్ లో రానా మొదలు చాలా మంది పెళ్లిల్లు చేసుకున్నారు. అదీ పెద్దగా సంకేతాలు ఏమీ ఇవ్వకుండానే! ఇలా అనౌన్స్ చేసి అలా మూడు ముళ్ల ముచ్చట తీర్చేసుకున్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో అంతగా సెలబ్రిటీ మ్యారెజెస్ జరగటం లేదు కానీ… రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత తన రియల్ లైఫ్ హీరో చిటికెన వేలు పట్టేసుకుంది! చాలా లో ప్రొఫైల్ లో బెంగుళూరు బ్యూటీ పెళ్లి కానిచ్చేసింది!
ప్రణీత సర్ ప్రైజ్ మ్యారేజ్ ఎలా ఉన్నా… ఇప్పుడు సొషల్ మీడియాలో స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి కూడా నెటిజన్స్ మాట్లాడేసుకుంటున్నారు. ఆమె సైతం రేపో, మాపో పప్పన్నం పెడుతుందని డిస్కషన్ చేస్తున్నారు. ఇందుక్కారణం కొన్ని నెలల కిందట ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారమైన వినోద కార్యక్రమమే! అందులో శ్రీముఖి స్ట్రైట్ ఫార్వార్డ్ గా ‘నేను కమిటెడ్. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు’ అనేసింది!
సుమ యాంకరింగ్ చేసిన సదరు షోలో శ్రీముఖి తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడటం సీరియస్ గా కావచ్చు. లేదంటే ఏదో సరదాగానూ అలా స్పందించి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు జనం మాత్రం ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా’ అంటున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలందరికీ బోలెడంత ఫ్రీ టైం దొరుకుతోంది. అందుకే, మూడు ముళ్లు, ఏడు అడుగులు కానిచ్చేస్తున్నారు. మరి బిగ్ బాస్ బ్యూటీ శ్రీముఖి కూడా బిగ్ డిజీషన్ తీసేసుకుంటుందా? లెట్స్ వెయిట్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-