కరోనాతో ‘శ్రీకారం’ కో డైరెక్టర్ కన్నుమూత

కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తోంది. పలువురు సెలెబ్రిటీలకు కరోనా సోకగా, కొంతమంది ఆసుపత్రుల్లో ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కో డైరెక్టర్ రాజా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ కో డైరెక్టర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు కూడా మరణించడం కలచి వేస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కో డైరెక్టర్ గా పని చేసిన రాజా రీసెంట్ గా కరోనా బారిన పడ్డారు. కరోనాకు చికిత్స తీసుకునేలోపే ఆ మహమ్మరి రాజాను బాలి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన తల్లిదండ్రులు కూడా కరోనాతో ఒకేరోజు మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు కో డైరెక్టర్ రాజాకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-