మీడియా లేకుంటే మా సినిమా లేదు: శ్రీవిష్ణు

హీరో శ్రీవిష్ణు కెరీర్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకులకు చేరువైయ్యాడు. చాలా వరకు హడావిడికి దూరంగా ఉంటూ, చాలా సింపుల్ గా కనిపిస్తుంటాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రాజ రాజ చోర’ కు పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేయటం, కరోనా పరిస్థితుల్లో విశేషమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘రాజ రాజ చోర’ కోసం ప్రొడ్యూసర్ పూర్తిస్వేచ్ఛను ఇచ్చారు. చిత్రయూనిట్ అంత చాలా కస్టపడి పనిచేశారు. ఈ సినిమాలో కనిపించిన ప్రతి పాత్ర అందరికి సమానంగా కనిపిస్తోంది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాకుండా చాలా బాగా వచ్చింది సినిమా.. అలాంటి పాత్ర‌ల‌ను క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు హ‌సిత్ గ్రేట్‌..

ఇక, వివేక్ ఆత్రేయకు స్పెషల్ థాంక్స్.. ఈ క‌థ ఇంత బాగా రావ‌డానికి వివేక్ ఆత్రేయ ఓ మెంట‌ర్‌లాగా ఉండి న‌డిపించాడు. క‌రోనా టైమ్‌లో త‌ను చేస్తున్న సినిమాల‌కు సంబంధించిన క‌థ‌లు రాసుకుంటూ, మాకు ఫోన్ చేసి మా క‌థ గురించి డిస్క‌స్ చేస్తూ మాకెంతో స‌పోర్ట్‌గా నిలిచాడు. త‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌.. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మేఘా ఆకాశ్‌, సునయన, రవి బాబు, తనికెళ్ళ భరణి అందరు బాగా నటించారు.

తెలుగు మీడియా లేకపోతే మా సినిమా లేదు. ఇంత తక్కువ సమయంలో మీరే ఈ చిత్రాన్ని జానాల్లో తీసుకెళ్లి హిట్ చేశారు. ప్రేక్షకులు అందించిన ఈ ఘన విజయానికి మీడియా వారధిగా నిలిచింది. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు’ అంటూ శ్రీవిష్ణు తెలిపారు.

-Advertisement-మీడియా లేకుంటే మా సినిమా లేదు: శ్రీవిష్ణు

Related Articles

Latest Articles