సమరం మొదలెట్టబోతున్న అర్జునుడు!

తుదిమెరుగుల్లో ‘అర్జున ఫ‌ల్గుణ‌’!

శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’. థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘జోహార్’ను తెరకెక్కించిన తేజ మర్ని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం నిర్మిస్తున్న మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘అర్జున ఫల్గుణ’ రూపుదిద్దుకుంటోంది. ఒక‌వైపు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనర్స్‌, మ‌రోవైపు యువ ప్ర‌తిభావంతుల‌తో కంటెంట్ రిచ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ నిర్మిస్తూ ప‌ర్ఫెక్ట్ స్ట్రాట‌జీతో ముందుకు వెళుతోందీ సంస్థ. టైటిల్ గురించి దర్శకుడు చెబుతూ, మ‌హాభార‌తంలో అర్జునునికి ఫ‌ల్గుణ అనే మ‌రో పేరు కూడా ఉంద‌ని మ‌న‌కు తెలుసు. ఫాల్గుణ మాసంలో జ‌న్మించినందున ఆయ‌నను ఆ పేరుతోనూ పిలుస్తుంటారు. ఇందులో ఆ పేరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది” అని అన్నారు. ఎన్‌.ఎం. పాషా స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ మూవీకి క‌థ‌, స్క్రీన్‌ప్లేను ద‌ర్శ‌కుడు తేజ మ‌ర్ని స్వ‌యంగా స‌మ‌కూరుస్తున్నారు. సుధీర్ వ‌ర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని చిత్రబృందం తెలిపింది.

-Advertisement-సమరం మొదలెట్టబోతున్న అర్జునుడు!

Related Articles

Latest Articles