ఆగస్ట్ 6న థియేటర్లలో ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ఇప్పటికే తొలి కాపీని సిద్ధం చేసుకున్న ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రమోద్, రాజు చెబుతూ వచ్చారు. అన్నమాట ప్రకారమే ఈ సినిమాను ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. సో… ఈ నెలాఖరుకు ఏపీ, తెలంగాణాలో థియేటర్లు తెరుచుకోగానే తొలుత ‘తిమ్మరుసు’ చిత్రం రానుంది. ఆ వెనుకే ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ థియేటర్లలో సందడి చేస్తుందని భావించొచ్చు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్ కీలక పాత్ర పోషించారు.ఆగస్ట్ 6న థియేటర్లలో ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-