థియేటర్లలోనే ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’!

‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా నిజానికి ఇదే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తాజాగా తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే… ఈ చిత్ర కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘సెబాస్టియన్ పి.సి. 524’ కాగా, మరొకటి ‘సమ్మతమే’. ఇవి కాకుండా మరో రెండు సినిమాలను కిరణ్‌ అబ్బవరం లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ యంగ్ హీరో చాలా కాన్ఫిడెంట్ గానే టాలీవుడ్ లో ముందుకు సాగుతున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-