కేంద్రం మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: కిషన్‌ రెడ్డి

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేం దుకే కేసీఆర్‌ కొత్త నాటకానికి తెర లేపారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ ఎస్‌ పై నిప్పులు చెరిగారు. మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ రాష్ర్ట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రం పై అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆయన మండి పడ్డారు. ఓ వైపు వరి ధాన్యం మొత్తం మేమే కొంటామని చెప్పి ఇప్పుడు ఆ నెపంను కేంద్రం పై తోస్తున్నారన్నారు. యాసంగి లో వరి వేస్తే ఉరి అని కేసీఆర్‌ చెప్పడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదని ఆయన విమర్శించారు.

రాష్ర్టంతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి గింజను కేంద్రం కొంటుందని ఆయన స్పష్టం చేశారు. రైతు చట్టాలపైన కేసీఆర్‌ విషం కక్కారని ఎద్దేవా చేశారు. మొదట రైతుల కోసమని చెప్పి ఇప్పుడు రైతులను దోచుకునేందుకు కేంద్రం చట్టాలను చేసిందని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశాడని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. మోజార్టీ రైతులు చట్టాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండటంతోనే మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకున్నారన్నారు. పంజాబ్‌ రైతులకు పరిహారం ఇవ్వడంలో తప్పులేదని, కానీ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

Related Articles

Latest Articles