RR vs RCB: గువాహటిలో ఆసక్తికర పోరు.. హేజిల్‌వుడ్ వచ్చేశాడు, బుడ్డోడికి ఇక చుక్కలే!
- మరికొద్దిసేపట్లో రాజస్థాన్, బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు
- బెంగళూరు తుది జట్టులోకి హేజిల్‌వుడ్
- హేజిల్‌వుడ్ రాకతో బెంగళూరు బౌలింగ్ పటిష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఆసక్తికర పోరు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల వర్షాలు కురవడంతో పిచ్‌లో కొంత తేమ ఉండొచ్చని, ఆ పరిస్థితులను ఉపయోగించుకోవానుకున్నట్లు తెలిపాడు. తుషార్‌కు విశ్రాంతి ఇచ్చి.. బ్రిజేష్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పాటీదార్ మాట్లాడుతూ.. తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. జాకబ్ డఫీ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ తుది జట్టులోకి వచ్చాడు.
జోష్ హేజిల్‌వుడ్ రాకతో బెంగళూరు బౌలింగ్ పటిష్టం అయింది. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మలు హేజిల్‌వుడ్‌కు సహకరించనున్నారు. హేజిల్‌వుడ్ తుది జట్టులోకి రావడంతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి షాట్లు ఆడడం కష్టమే అని ఫాన్స్ అంటున్నారు. బుడ్డోడికి ఇక చుక్కలే అంటూ ఆర్సీబీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించిపాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆర్సీబీ కూడా రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి మంచి జోష్‌లో ఉంది.
Also Read
- Shubman Gill: ఏబీ డి విలియర్స్‌ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్
- GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!
- Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!
- Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 34 సార్లు తలపడ్డాయి. అందులో బెంగళూరు 17 సార్లు గెలవగా, రాజస్థాన్ 14 సార్లు విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డు ఆర్సీబీ వైపు ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఫామ్ మాత్రం రాజస్థాన్‌కు అనుకూలంగా ఉంది. అత్యధిక స్కోర్ విషయానికి వస్తే రాజస్థాన్ 217 పరుగులు చేయగా, ఆర్సీబీ 205 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య పోరు కావడంతో మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
తుది జట్లు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొయారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్.
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), హెట్‌మయర్, ఫెర్రీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ.
తాజావార్తలు
-
TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్‌లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
-
Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్‌రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
-
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్‌ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్