టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్.
ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. భజ్జి తన కెరీర్ లో 367 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. ఇందులో 711 వికెట్లు తీసి.. చరిత్ర సృష్టించాడు బజ్జి. బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ రాణించగల సత్తా ఉన్న హర్బజన్ సింగ్.. తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ లను కూడా నమోదు చేసుకున్నాడు. టీమిండియా తో పాటు ఐపీఎల్ టోర్నీలో చెన్నై, కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడాడు. అయితే.. ఐపీఎల్ లో భజ్జీ ఆడతాడా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.