‘పుష్ప’రాజ్ ని ఢీ కొట్టబోతున్న హాలీవుడ్ స్టార్

టాలీవుడ్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోరు తప్పడం లేదు. డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాలన్నీ పోటీలో నిలిచాయి. ఇలా సినిమాలను వరుసగా విడుదల చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నిర్మాతలంతా సమావేశమై తమ సినిమాల విడుదల విషయమై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా జనవరి సినిమాల విషయంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘పుష్ప’రాజ్ ను ఢీ కొట్టడానికి హాలీవుడ్ స్టార్ హీరో సిద్ధమయ్యాడు.

Read Also : రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్

‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్’ ‘పుష్ప’రాజ్ తో క్లాష్ కు సై అంటున్నాడు. “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” కొత్త ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ట్రైలర్ లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. ట్రైలర్‌లో మార్వెల్ శాండ్‌మ్యాన్, డాక్టర్ ఆక్టోపస్, ఎలక్ట్రో, గ్రీన్ గోబ్లిన్, లిజార్డ్, హాబ్‌ గోబ్లిన్‌లు కన్పించడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ట్రైలర్ చివరలో ‘స్పైడర్ మ్యాన్’ ఈ ఆరుగురు విలన్‌లతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు.

అదే రోజున ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా మూవీగా భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ‘స్పైడర్ మ్యాన్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘పుష్ప’. ఏదైతేనేం ‘పుష్ప’రాజ్ గట్టి పోటీనే ఎదుర్కోబోతున్నాడు.

Related Articles

Latest Articles