నేటి నుంచి టీటీడీ ఉద్యోగుల‌కు స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌…

రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మొద‌టివేవ్ స‌మ‌యంలో రాష్ట్రంలో ఎక్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఏపీపైనే అధికంగా ప‌డింది.  అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వ్యాక్సినేష‌న్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల‌కు వ్యాక్సిన్ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  దీనికోసం స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఈరోజు నుంచి టీటీడీ ఉద్యోగుల‌కు వ్యాక్సిన్ అందించ‌నున్నారు.  ఇక ఇదిలా ఉంటే, క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య పెరుగుతున్న‌ది.  నిన్న శ్రీవారిని 13,918 మంది భ‌క్తులు ద‌ర్శించుకోగా, 5,952 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.  ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.15 కోట్లుగా ఉన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-